German Open: జర్మన్ ఓపెన్‌లోనూ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్. సూపర్ 300 టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో మరో భారత క్రీడాకారుడు హెచ్ఎస్ ప్రణయ్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు. కేవలం 39 నిమిషాల్లోనే 21-15, 21-16 తేడాతో గెలుపొందాడు. దీంతో పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లాడు 20 ఏళ్ల లక్ష్యసేన్.
German Open: సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్ - హెచ్ఎస్ ప్రణయ్
German Open: జర్మన్ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్లో సెమీఫైనల్ చేరుకున్నాడు భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు.
Lakshya Sen
ఒలింపిక్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్సెన్, భారత స్టార్ కిదాంబి శ్రీకాంత్ మధ్య శనివారం జరగబోయే మరో క్వార్టర్‌ఫైనల్ విజేతతో సెమీస్‌లో సేన్ తలపడనున్నాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఇండియా ఓపెన్‌లో తన తొలి సూపర్ 500 టైటిల్ గెలిచాడు లక్ష్యసేన్.
ఇదీ చూడండి:German Open: క్వార్టర్స్‌కు శ్రీకాంత్.. సింధు, సైనా ఔట్