'ఈనాడు' సీఎస్‌ఆర్ కార్యక్రమం 'లక్ష్య' క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటారు. ఈనెల 26 నుంచి 28 వరకు గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన పోటీల్లో పతకాల పంట పండించారు. 44 స్వర్ణాలు, 45 రజతాలు, 32 కాంస్యాలతో కలిపి మొత్తం 121 పతకాలు కైవసం చేసుకున్నారు. విజయవాడ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, చిత్తూరు, గుంటూరు, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, అనంతపురం, విశాఖపట్నం, కడప, హీల్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందుతున్న 'లక్ష్య' క్రీడాకారులు పోటీల్లో జోరు చూపించారు.
లక్ష్య అథ్లెట్ల హవా, 44 స్వర్ణాలు సహా 121 పతకాలు కైవసం - eenadu csr program
'ఈనాడు' సీఎస్‌ఆర్ కార్యక్రమం 'లక్ష్య' క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టారు. మొత్తంగా 44 స్వర్ణాలు, 45 రజతాలు, 32 కాంస్యాలతో కలిపి మొత్తం 121 పతకాలు కైవసం చేసుకున్నారు.
అండర్-14 బాలికల విభాగంలో డింపుల్ మహశ్రీ (స్వర్ణం- ట్రయథ్లాన్, స్వర్ణం- 60 మీటర్లు; పశ్చిమ గోదావరి) ఉత్తమ అథ్లెట్‌గా నిలిచింది. అండర్-18 బాలికల్లో నాగ విహారిక (స్వర్ణం- 100 మీ, స్వర్ణం- 100 మీ హర్డిల్స్; గుంటూరు), అండర్-18 బాలురలో సుధీర్‌రెడ్డి (స్వర్ణం- 100 మీ; అనంతపురం) ఉత్తమ అథ్లెట్లుగా అవార్డులు అందుకున్నారు. అండర్-20 బాలికల్లో ప్రత్యూష (స్వర్ణం- 100 మీ; అనంతపురం), అండర్-20 బాలురలో భాను శ్రీనివాస్ (స్వర్ణం- 100 మీ హర్డిల్స్; గుంటూరు) ఉత్తమ అథ్లెట్లుగా నిలిచారు. విజయవాడకు చెందిన కరుణశ్రీ (స్వర్ణం- 800 మీ, రజతం- మిక్స్‌డ్ రిలే, రజతం- 4×400 మీ రిలే) మూడు పతకాలతో మెరిసింది. ప్రకాశం జిల్లాకు చెందిన మహాలక్ష్మి (స్వర్ణం- లాంగ్‌జంప్, స్వర్ణం- 400మీ), మనీషా (స్వర్ణం- జావెలిన్ త్రో, స్వర్ణం- డిస్కస్ త్రో), వికాస్ (స్వర్ణం- షాట్‌పుట్, స్వర్ణం- డిస్కస్ త్రో), కావ్యాంజలి (స్వర్ణం- 1500 మీ, కాంస్యం- 800 మీ) రెండేసి పతకాలతో సత్తాచాటారు. చిత్తూరు జిల్లా క్రీడాకారులు సాత్విక్ (స్వర్ణం- డిస్కస్ త్రో, రజతం- షాట్‌పుట్), గణేశ్ (స్వర్ణం- డిస్కస్ త్రో, కాంస్యం- షాట్‌పుట్).. గుంటూరు అథ్లెట్ సంజయ్ బాబు (స్వర్ణం- షాట్‌పుట్, కాంస్యం- డిస్కస్ త్రో), శ్రీకాకుళం అమ్మాయి చేతన (స్వర్ణం- 200 మీ, రజతం- 100మీ); విజయనగరానికి చెందిన అశోక్ (స్వర్ణం- 3000 మీ స్టీపుల్ ఛేజ్, రజతం- 1500 మీ); విశాఖపట్నం అథ్లెట్లు కావ్య (స్వర్ణం- ట్రిపుల్ జంప్, స్వర్ణం- హైజంప్), లోహిత్‌కుమార్ (స్వర్ణం- 400 మీ, రజతం- 200 మీ) రెండేసి పతకాలతో అదరగొట్టారు.
ఇదీ చూడండి: హార్దిక్‌ను చూస్తే ధోనీ గుర్తుకొస్తున్నాడు, ఫ్యూచర్ కెప్టెన్ అతడే