తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రేక్షకుల చిత్రాలతో బేస్​బాల్​ లీగ్​ - దక్షిణ కొరియాలో బేస్​బాల్​ లీగ్​ నిర్వహించారు

దక్షిణ కొరియాలో బేస్​బాల్​ లీగ్​ నిర్వహించారు. కరోనా నేపథ్యంలో అభిమానులు లేకుండానే ఈ మ్యాచ్​ జరిగింది. ఆ లోటు తెలియకుండా ఉండేందుకు ప్రేక్షకుల చిత్రాలను స్టేడియంలో ఏర్పాటు చేశారు.

Korean baseball league begins in empty stadiums
ప్రేక్షకుల చిత్రాలతో బేస్​బాల్​ లీగ్​

By

Published : May 6, 2020, 7:55 AM IST

క్రీడాకారులకు ఉత్సాహాన్నిచ్చే వార్త.. అభిమానుల ఆశలను పెంచే విషయం.. ఆట మళ్లీ మొదలైంది. ఓ లీగ్‌ ఆరంభమైంది. నిజమే.. ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకున్న ఈ వేళ దక్షిణ కొరియాలో బేస్‌బాల్‌ లీగ్‌ షురూ అయింది.

కరోనా మహమ్మారితో ఆటలన్నీ బంద్‌ అయ్యాక తిరిగి ఆరంభమైన తొలి ప్రధాన ప్రొఫెషనల్‌ లీగ్‌ ఇదే కావడం విశేషం. మంగళవారం మైదానంలో ఉల్లాసినుల చిందులు కనిపించాయి.. ఆటగాళ్ల కేకలు వినిపించాయి.. కనిపించనిది అభిమానుల కోలాహలం మాత్రమే! అయితే ఆ లోటు కూడా లేకుండా ఉండేందుకు ప్రేక్షకుల చిత్రాలను స్టేడియంలో ఏర్పాటు చేశారు. క్రీడాకారులు కరోనా బారిన పడకుండా సురక్షితమైన వాతావరణంలో నిర్వాహకులు మ్యాచ్‌ను నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details