కార్ రేస్, బైక్ రేస్ గురించి విన్నాం.. ఆఖరుకు బోట్ రేస్ కూడా చూశాం.. ఎప్పుడైనా డ్రోన్ రేస్ గురించి విన్నారా? అందులోనూ వివిధ దేశాలతో కలిసి ఛాంపియన్షిప్ నిర్వహిస్తారని తెలుసా? అవునండీ.. చైనాలోని జియాంగ్జిన్లో ఈ పోటీలు జరిగాయి. శనివారం జరిగిన ఫైనల్లో కొరియాకు చెందిన చాంగ్యాన్ జాంగ్ విజేతగా నిలిచాడు.
పురుషుల జూనియర్ విభాగంలో జరిగిన తుదిపోరులో జేజాంగ్ కాంగ్, శామ్ హీప్స్ను ఓడించి, ఛాంపియన్గా అవతరించాడు చాంగ్యాన్. అంతేకాకుండా టోర్నీ ఫైనల్లోనూ విజేతగా నిలిచాడీ కొరియా రేసర్. ఆస్ట్రేలియాకు చెందిన థామస్, ఫ్రాన్స్ కిలియన్ రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యారు.