Korea Open Sindhu: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, మూడో సీడ్ పీవీ సింధు.. కొరియా ఓపెన్‌ను ఘనంగా ప్రారంభించింది. అమెరికాకు చెందిన లారెన్ లామ్‌ను వరుస సెట్లలో ఓడించి.. రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధు.. లామ్పై 21-15,21-14 తేడాతో గెలిచింది. మ్యాచ్ 34 నిమిషాల్లోనే ముగియడం విశేషం. జపాన్‌కు చెందిన అయా ఒహోరితో రెండో రౌండ్లో తలపడనుంది భారత స్టార్ షట్లర్.
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నెం.1 కిదాంబి శ్రీకాంత్ కూడా రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. మలేసియాకు చెందిన డారెన్ లీపై 22-20,21-11 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ మ్యాచ్ 40 నిమిషాల్లోనే ముగిసింది. తదుపరి రౌండ్లో ఇజ్రాయెల్‌కు చెెందిన మిషా జిల్బర్మ్యాన్తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. పురుషుల డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్, ధ్రువ్ కపిల జోడీకి తొలి రౌండ్లో వాకోవర్ లభించింది. రెండో రౌండ్లో ఇండోనేసియా జోడీ మహ్మద్ అహ్సన్- హేంద్రా సేటియావాన్తో తలపడనుంది.