తెలంగాణ

telangana

ETV Bharat / sports

Korea Open 500 Badminton 2023 : ఫైనల్​కు దూసుకెళ్లిన సాత్విక్‌-చిరాగ్ జోడీ

Korea Open 500 Badminton 2023 : కొరియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్‌-చిరాగ్ జోడీ సంచలన ఆటతో ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Korea Open 500 Badminton 2023
ఫైనల్స్​లోకి అడుగుపెట్టిన సాత్విక్-చిరాగ్ జోడీ

By

Published : Jul 22, 2023, 3:39 PM IST

Updated : Jul 22, 2023, 4:22 PM IST

Korea Open 500 Badminton 2023 : కొరియా ఓపెన్ సూపర్ వరల్డ్​ టూర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో.. భారత స్టార్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడి ఫైనల్స్​లో అడుగుపెట్టింది. పురుషుల డబుల్స్​ల్​లో చైనీస్ జోడీ.. లియాంగ్ కెంగ్ - వాంగ్ చాంగ్​తో నువ్వానేనా అన్నట్టు సాగిన సెకెండ్ సీడెడ్​ ఆటలో 21-15, 24-22 తేడాతో గెలుపొందారు.

ఈ సెమీస్ మ్యాచ్​లో భారత స్టార్ జోడీ.. ప్రపంచ నెం 3తో తలపడింది. మూడో సీడ్​లో 9-8గా ఉన్న దశలో బ్యాక్​ టూ బ్యాక్ పాయింట్లతో 14 - 8 తో తొలి గేమ్​లో పైచేయి సాధించింది. అయితే వీరిద్దరూ తొలి రౌండ్​ను ఈజీగా నెగ్గినప్పటికీ.. రెండో రౌండ్​లో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక దశలో ప్రత్యర్థి జోడీ స్కోర్​ను సమం చేశారు. దీంతో సాత్విక్ - చిరాగ్ జోడీ మరింత దూకుడుగా ఆడి 40 నిమిషాల్లో ఆటను గెలుపుతో ముగించింది.

ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000, స్విస్ ఓపెన్ 500 టైటిళ్లు నెగ్గిన సాత్విక్‌ - చిరాగ్ జోడీ.. ఈ ఏడాది మూడో ఫైనల్​ మ్యాచ్ ఆడేందుకు సిద్ధం అయ్యింది. ఇక ఇండోనేసియా ప్లేయర్లు ఫజర్ - రియాన్, కొరియా ఆటగాళ్లు కాంగ్ మిన్- సియో సంగ్​ల మధ్య జరిగే మరో సెమీస్​లో విజేతతో భారత జోడీ ఫైనల్​లో తలపడనుంది.

చైనీస్ జోడీపై తొలిసారి..
ఈ చైనీస్ జోడీపై భారత స్టార్ షట్లర్లు సాత్విక్-చిరాగ్​లకు ఇదే మొదటి విజయం. ఇది వరకు ఈ ఆటగాళ్లతో ఈ జోడీ రెండు సార్లు తలపడగా రెండింట్లోనూ ఓడింది. ఈ చైనీస్ జోడీ ఇదే సంవత్సరం థాయ్​లాండ్, ఇండియా ఓపెన్​లను కూడా గెలుచుకుంది.

Korea Open 500 PV Sindhu : ఇదే కొరియా ఓపెన్​ 2023లో పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌ మొదటి రౌండ్లలో ఓడి ఇంటి బాట పట్టారు. సింధు మహిళల సింగిల్స్​లో చైనీస్ ప్లేయర్ పాయ్‌ యుపో చేతిలో ఓడిపోయింది. మరోవైపు పురుషుల సింగిల్స్​లో శ్రీకాంత్.. జపాన్ ఆటగాడు కెంటో మొమోటాతో ఓడాడు. కాగా మొమోటా చేతిలో శ్రీకాంత్ వరుసగా 12 సార్లు ఓటమి చవిచూశాడు.

Last Updated : Jul 22, 2023, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details