తెలంగాణ

telangana

ETV Bharat / sports

CHESS: ప్రపంచకప్​ నుంచి వైదొలిగిన హంపి - వరల్డ్​కప్​కు హంపి దూరం

భారత చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి.. చెస్​ ప్రపంచకప్​ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించింది. 300 మంది పాల్గొనే టోర్నీని ఒకే వేదికపై నిర్వహించడమే ఇందుకు కారణమని తెలిపింది.

koneru humpy, indian grandmaster
కోనేరు హంపి, భారత చెస్ క్రీడాకారిణి

By

Published : Jun 5, 2021, 7:50 AM IST

గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి(Koneru Hampi) చెస్‌ ప్రపంచకప్‌ (Chess World Cup)కు దూరం కానుంది. వచ్చే నెల రష్యాలోని సోచిలో జరగబోయే ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. పురుషులు, మహిళలు కలిపి 300 మందికిపైగా క్రీడాకారులు పాల్గొనే టోర్నీని ఒకే వేదికలో నిర్వహిస్తుండడం వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు హంపి తెలిపింది.

కరోనా కారణంగా జిబ్రాల్టర్‌లో ముగిసిన మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీకి కూడా హంపి దూరమైంది. "ప్రపంచకప్‌ క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత ఈవెంట్‌. నేను ఇప్పటికే క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించాను. అందుకే ప్రపంచకప్‌ నుంచి తప్పుకొన్నా" అని హంపి తెలిపింది.

ఇదీ చదవండి:CHESS: 'తగ్గుతున్న చెస్ క్రీడాకారుల కెరీర్ టైమ్'​

ABOUT THE AUTHOR

...view details