తెలంగాణ

telangana

ETV Bharat / sports

మొనాకో గ్రాండ్​ప్రి చెస్ టోర్నీ రన్నరప్​గా హంపి - Koneru Humpy Runner

ఫిడే నిర్వహించిన మహిళల మొనాకో గ్రాండ్​ప్రి చెస్ టోర్నీలో భారత ప్లేయర్ కోనేరు హంపి రన్నరప్​గా నిలిచింది. పాయింట్ల సమంగా రావడం వల్ల ట్రై బ్రేక్​ తీయగా.. రెండో స్థానంలో నిలిచింది తెలుగు తేజం.

Koneru Humpy as Runner in Monaco Grand Pre Chess Tournament
కోనేరు హంపి

By

Published : Dec 15, 2019, 3:46 PM IST

అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) మహిళల మొనాకో గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నమెంట్‌లో భారత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి రన్నరప్‌గా నిలిచింది. 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో హంపి రెండో స్థానంలో నిలిచింది.

ఈ టోర్నీలో 7 పాయింట్లు సాధించిన హంపి రష్యా ప్లేయర్లు అలెగ్జాండ్రా కొస్టెనిక్‌, అలెగ్జాండ్రా గొర్యాచికినాతో సమంగా నిలిచింది. అయితే టైబ్రేక్‌ నిబంధనల ఆధారంగా కొస్టెనిక్‌ టైటిల్‌ గెలిచింది. హంపి రెండో స్థానంలో, గొర్యాచికినా మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

శనివారం జరిగిన చివరిదైన 11వ రౌండ్‌ గేమ్‌లో గొర్యాచికినాపై హంపి 68 ఎత్తుల్లో గెలిచింది. ఈ టోర్నీలో ఆమె మొత్తంగా నాలుగు గేముల్లో విజయం సాధించి, ఆరింటిని డ్రా చేసుకొని, ఒక గేమ్‌లో ఓడింది. మరో భారత క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక 5.5 పాయింట్లతో ఈ టోర్నీలో ఆరో స్థానంలో నిలిచింది.

ఇదీ చదవండి: ధోనీ టీ20ల్లోనే ఆడతాడా.. వన్డేల మాటేమిటి?

ABOUT THE AUTHOR

...view details