తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్లాగింగ్​: దేశవ్యాప్తంగా ప్రారంభమైన 'స్వచ్ఛ' పరుగు - plogging

ఫిట్​ ఇండియాలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఫిట్​ ఇండియా ప్లాగ్ రన్​కు విశేష ఆదరణ లభిస్తుంది. ఉదయం ఐదు గంటల నుంచే ప్రజలు జాగింగ్ చేస్తూ.. చెత్తను ఏరేస్తున్నారు.

ప్లాగింగ్

By

Published : Oct 2, 2019, 5:11 AM IST

Updated : Oct 2, 2019, 8:20 PM IST

ఫిట్​నెస్​తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో 'ఫిట్ ఇండియా ప్లాగ్ రన్'​కు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇందుకు తగినట్లుగానే దేశవ్యాప్తంగా ప్లాగ్ రన్​లో పాల్గొంటున్నారు ప్రజలు. ఉదయం ఐదు గంటల నుంచే జాగింగ్ చేస్తూ.. చెత్త ఏరేస్తున్నారు.

కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు ప్లాగింగ్ ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా 2.4 లక్షల కిలోమీటర్లు పరుగెత్తి.. 12 టన్నుల చెత్తను ఏరేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ విషయాన్ని కేంద్రీయ విద్యాలయాల సంఘటన్(కేవీఎస్) అధికారి తెలిపారు.

పరుగు తీస్తూ ప్లాస్టిక్ చెత్తను ఏరేసే కార్యక్రమమే ప్లాగింగ్. దేశవ్యాప్తంగా ఉన్న 1200 కేంద్రీయ విద్యాలయాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్లాగింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇది విజయవంతమైతే ఎక్కువ మంది ప్లాగింగ్ చేసిన రికార్డు దక్కుతుంది. 2.4 లక్షల కిలోమీటర్ల పరుగెత్తి 12 టన్నుల ప్లాస్టిక్ చెత్తను ఏరేయాల్సిందిగా నిర్ణయించాం -కేవీఎస్ అధికారి.

అక్టోబరు 2న ప్రతి ఒక్కరూ 2 కిలోమీటర్లు జాగింగ్ చేస్తూ.. దారిలో కనిపించే చెత్తను తొలగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి మోదీ.

ఇదీ చదవండి: ప్లాగింగ్​: మనతో పాటు దేశమూ ఫిట్

Last Updated : Oct 2, 2019, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details