అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) అధ్యక్షుడిగా సంజయ్ కపూర్ ఎన్నికయ్యారు. భరత్ సింగ్ చౌహాన్ కార్యదర్శి పదవిని నిలబెట్టుకున్నారు. అంతర్జాలం వేదికగా సమాఖ్యకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు.
ఉత్తర్ప్రదేశ్ చెస్ సంఘం నుంచి పోటీ చేసిన సంజయ్.. రెండు ఓట్ల తేడాతో వెంకట్రామ రాజాపై నెగ్గారు. సంజయ్కు 33ఓట్లు రాగా.. రాజాకు 31ఓట్లు వచ్చాయి. భరత్.. రవీంద్రపై 35-29 తేడాతో గెలిచారు.