టోక్యో ఒలింపిక్స్‌కు మరో భారత అథ్లెట్ అర్హత సాధించింది. మహిళల డిస్కస్ త్రో విభాగంలో కమల్‌ప్రీత్ కౌర్ ప్రతిష్ఠాత్మక టోర్నీకి క్వాలిఫై అయ్యింది. అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్‌లో భాగంగా 65.06 మీటర్ల దూరం డిస్కస్‌ను విసిరిన కమల్‌ప్రీత్.. జాతీయ రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్‌కు అర్హత పొందాలంటే 63.5 మీటర్లు డిస్కస్‌ను విసరాల్సి ఉంది.
మహిళల డిస్కస్ త్రో విభాగంలో 2012లో క్రిష్ణ పూనియా (64.76 మీ.) పేరిట ఉన్న రికార్డును.. తాజాగా కమల్‌ప్రీత్ అధిగమించింది.