తెలంగాణ

telangana

ETV Bharat / sports

Manu Bhaker News: మనుకు నాలుగో పసిడి - ఐఎస్​ఎస్​ఎఫ్

జూనియర్ షూటింగ్ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో(ISSF junior world championship 2021) మను బాకర్(Manu Bhaker News) మరో పసిడి సొంతం చేసుకుంది. ఫైనల్లో భారత జట్టు 16-4తో అమెరికాపై గెలిచింది.

manu bhaker
మను బాకర్

By

Published : Oct 8, 2021, 7:31 AM IST

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో(ISSF junior world championship 2021) భారత స్టార్‌ మను బాకర్‌(Manu Bhaker News) జోరు కొనసాగుతోంది. ఇప్పటికే మూడు స్వర్ణాలు సొంతం చేసుకున్న ఆమె.. తాజాగా రిథమ్‌ సాంగ్వాన్‌, నామ్య కపూర్‌తో కలిసి 25మీ. పిస్టల్‌ మహిళల టీమ్‌ పసిడిని ఖాతాలో వేసుకుంది. ఫైనల్లో భారత జట్టు 16-4తో అమెరికాపై గెలిచింది.

పురుషుల ట్రాప్‌ టీమ్‌ విభాగంలో దేశానికి రజతం దక్కింది. తుదిపోరులో బక్‌త్యారుద్దీన్‌, శార్దూల్‌, వివాన్‌తో కూడిన భారత త్రయం 4-6తో ఇటలీ చేతిలో ఓడింది. పురుషుల 25మీ. ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌లో ఆదర్శ్‌ సింగ్‌ వెండి పతకం గెలిచాడు. కవల షూటర్లు ఉదయ్‌వీర్‌, విజయ్‌వీర్‌ కూడా ఫైనల్‌ చేరినప్పటికీ పతక పోరులో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయారు.

మరోవైపు జూనియర్‌ మహిళల ట్రాప్‌ టీమ్‌ కాంస్య పతక మ్యాచ్‌లో భారత్‌ 2-6తో జర్మనీ చేతిలో పరాజయం పాలైంది. ఇప్పటివరకూ తొమ్మిది స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, మూడు కాంస్యాలు కలిపి మొత్తం 20 పతకాలతో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఇదీ చదవండి:

పసిడి పోరులో అన్షు ఓటమి.. సరితకు కాంస్యం

ABOUT THE AUTHOR

...view details