ప్రపంచకప్ విజయాన్ని ప్రతి ఒక్క క్రికెటర్ ఏంతో ప్రత్యేకంగా భావిస్తారు. ఆ ప్రపంచకప్‌లో ధరించిన జెర్సీలను అపురూపంగా దాచుకుంటారు. కానీ ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ మాత్రం గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధరించిన జెర్సీని వేలం వేసి దాదాపు రూ.61 లక్షలు రాబట్టాడు. అయితే ఇదంతా కరోనాపై పోరాటానికి అండగా నిలిచేందుకే. వేలం ద్వారా వచ్చిన ఈ డబ్బును అతను స్థానిక రాయల్ బ్రాంప్టన్, హారిఫీల్డ్ ఆసుపత్రులకు అందించనున్నాడు. నిరుడు ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అర్ధశతకం చేయడంతో పాటు అతను సూపర్ ఓవర్లోనూ బ్యాటింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ విజేతగా నిలిచిన ఆ మ్యాచ్‌లో వేసుకున్న జెర్సీని గతవారం అంతర్జాలంలో వేలం పెట్టగా గడువు ముగిసే సమయానికి మొత్తం 82 బిడ్లు వచ్చాయి. దాంట్లో అత్యధిక మొత్తం వేసిన వాళ్లకు జెర్సీ దక్కింది.
హాకీ ఇండియా.. ఇంకో రూ.21 లక్షలు