అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) భార్య, ఆ దేశ ప్రథమ మహిళ జిల్ బైడెన్.. జులై 23న టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకకు వెళ్లనున్నారు. జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. తొలిసారి ఆయన లేకుండానే ఆమె విదేశీ ప్రయాణం చేస్తున్నారు. చివరిసారిగా 2010లో కెనడాలో జరిగిన వింటర్ గేమ్స్‌కు తన భర్తతో కలిసి వెళ్లారు జిల్.
గతంలోనూ పలువురు అమెరికా ప్రథమ మహిళలు ఒలింపిక్స్‌ను సందర్శించారు. 1994లో హిల్లారి క్లింటన్ లిల్లెహ్యామర్ వింటర్, 1996 అట్లాంట గేమ్స్‌ను వీక్షించగా.. 2006టురిన్ ఒలింపిక్స్, 2008 సమ్మర్ ఒలింపిక్స్‌లో లారా బుష్, 2012 సమ్మర్ ఒలింపిక్స్‌లో మిచెల్ ఒబామా సందడి చేశారు.