Jeswin Aldrin World Athletics : వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ఎట్టకేలకు ఉపశమనం కలిగించే వార్త ఒకటి అందింది. వరుసగా వివిధ క్రీడాంశాల్లో మన అథ్లెట్లు తమ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న సంగతి తెలిసిందే(world athletics championships 2023 india). ఇలాంటి పరిస్థితుల్లో పురుషుల లాంగ్‌జంప్‌లో జెస్విన్ అల్డ్రిన్ అద్భుత ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. మొదటి సారి ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అయితే ఇదే విభాగంలో పోటీ పడ్డ మరో స్టార్ లాంగ్‌జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ మాత్రం పేలవ ప్రదర్శనతో అర్హత రౌండ్లోనే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.
బుధవారం క్వాలిఫికేషన్లో మొత్తంగా 12వ స్థానంతో అల్డ్రిన్ ఫైనల్ అర్హత సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే 8 మీటర్ల దూరం దూకిన అతడు.. ఆ తర్వాతి రెండు ప్రయత్నాల్లో ఫౌల్ అయ్యాడు. 8.15మీ. దూరం దూకడం లేదా రెండు గ్రూప్‌ల్లో కలిపి టాప్-12లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. అలా ఈ ప్రదర్శనతో గ్రూప్-బిలో ఆరో స్థానంలో నిలిచిన అల్డ్రిన్.. మొత్తంగా 12వ స్థానంతో చివరి అథ్లెట్‌గా ఫైనల్‌కు వెళ్లాడు.
గ్రూప్- ఎ లో శ్రీశంకర్ వరుసగా 7.74మీ, 7.66మీ, 6.70మీ. ప్రదర్శన మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ గ్రూప్‌లో 12వ స్థానంలో నిలిచిన అతడు.. మొత్తంగా 22వ స్థానంతో ముగించాల్సి వచ్చింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా లాంగ్‌జంప్‌లో బెస్ పెర్ఫామెన్స్ చేసిన అథ్లెట్లలో మొదటి రెండు స్థానాల్లో అల్డ్రిన్ (8.42మీ), శ్రీశంకర్ (8.41మీ) కొనసాగుతున్నారు.