యూత్ ఒలింపిక్స్ స్వర్ణ గ్రహీత భారత వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్రినుంగా యూత్ వరల్డ్‌లో తన రికార్డు తానే బద్దలు కొట్టాడు. దోహా వేదికగా జరుగుతున్న ఖతర్ ఇంటర్నేషనల్కప్లో ఈ ఘనత సాధించాడు. 67 కేజీల విభాగంలో 306కేజీల(140కేజీ+166కేజీ) బరువు ఎత్తాడు.
శుక్రవారం జరిగిన ఈ పోటీల్లో స్నాచ్, క్లీన్, జెర్క్ విభాగాల్లో 306 కేజీలు ఎత్తి రజతం కైవసం చేసుకున్నాడు. మొత్తం తన పేరిట 27 రికార్డులు అందుకున్నాడు జెరెమీ. ఇందులో 12 అంతర్జాతీయ రికార్డులు(3 యూత్+ 3 ఆసియన్+ 6 కామన్వెల్త్ రికార్డులు) ఉన్నాయి.