రాష్ట్రంలో త్వరలో ఉన్నతమైన క్రీడా పాలసీ వస్తుందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ వెల్లడించారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో క్రీడాకారులకు మరింత ప్రోత్సహం అందుతుందన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ టేబుల్ టెన్నీస్‌లో పతకాలు సాధించిన ఆకుల శ్రీజ, స్నేహిత్లను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి సన్మానించారు.
త్వరలో క్రీడా పాలసీ... క్రీడాకారులకు మేలు: జయేశ్ రంజన్
రాష్ట్రంలో త్వరలో మంచి క్రీడా పాలసీ వస్తుందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. టేబుల్ టెన్నిస్‌లో పతకాలు సాధించిన ఆకుల శ్రీజ, స్నేహిత్‌లకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి సన్మానం చేశారు. క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు.
త్వరలో క్రీడా పాలసీ... క్రీడాకారులకు మేలు: జయేశ్ రంజన్
హర్యానాలోని పంచకులలో జరిగిన 82వ సీనియర్ టేబుల్ టెన్నిస్‌లో మహిళలు, పురుషులు రెండు విభాగాల్లో శ్రీజ, స్నేహిత్‌లు కాంస్య పతకాలు సాధించారు. 50 ఏళ్ల తర్వాత తెలంగాణకు నేషనల్ ఛాంపియన్ షిప్లో పతకాలు రావడం గర్వకారణమని జయేశ్ రంజన్ అన్నారు. క్రీడల్లో కష్టపడితేనే ఫలితాలు వస్తాయని... అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందిస్తున్న జాతీయ టేబుల్ టెన్నిస్ కోచ్ సోమ్ నాథ్ ఘోష్‌ను అభినందించారు.
ఇదీ చదవండి:పేదరికాన్ని దిగమింగి చిన్న వయసులోనే సివిల్ జడ్జిగా..