తెలంగాణ

telangana

ETV Bharat / sports

రూ.8 వేల కోట్లతో నెహ్రూ స్టేడియం నవీకరణ

దిల్లీలోని నెహ్రూ స్టేడియాన్ని భారీస్థాయిలో ఖర్చుచేసి నవీకరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల ప్రమాణాల స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.

రూ.8 వేల కోట్లతో నెహ్రూ స్టేడియం నవీకరణ
నెహ్రూ స్టేడియం

By

Published : Jun 12, 2020, 7:25 AM IST

దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియాన్ని రూ.8 వేల కోట్లతో నవీకరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలతో అభివృద్ధి చేయడం సహా.. వినియోగించని, తక్కువగా వినియోగిస్తున్న స్థలాన్ని వాణిజ్య కార్యకలాపాల కోసం నవీకరించాలన్నది ఉద్దేశం. ఐఓసీ, ఫిఫా, ఐఏఏఎఫ్‌ లాంటి అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల ప్రమాణాల మేర స్టేడియంలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ అభివృద్ధి పనులు చేస్తారు. నెహ్రూ స్టేడియం కాంప్లెక్స్‌ 102 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినా.. సరిగా అమలు చేయడం ముఖ్యమని భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు నరీందర్‌ బత్రా అన్నారు.

నెహ్రూ స్టేడియం(పాత చిత్రం)

ABOUT THE AUTHOR

...view details