ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి అన్ను రాణి జాతీయ రికార్డు నెలకొల్పింది. జావెలిన్ త్రోలో తనపేరిట ఉన్న రికార్డును తానే తిరగరాసింది. ఖతార్ దోహా వేదికగా జరిగిన క్వాలిఫైయింగ్ రౌండ్లో మూడో స్థానంలో నిలిచింది.
గ్రూప్-ఏ నుంచి అర్హత పోటీల్లో పాల్గొన్న అన్ను రాణి తొలి రౌండ్లో 57.05 మీటర్లు విసరగా.. రెండో రౌండ్లో 62.43 మీటర్లు విసిరింది. చివరి రౌండ్లో 60.50 మీటర్లతో మూడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది పటియాలాలో జరిగిన ఫెడరేషన్కప్లో 62.34 మీటర్లతో జాతీయ రికార్డు నెలకొల్పింది.