టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ఇంకో 15 రోజులు మాత్రమే సమయం ఉండగా.. ఆ దేశ ప్రధాని యొషిహిదె సుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా విజృంభణ దృష్ట్యా అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు ప్రకటించారు. ఒలింపిక్స్ పూర్తయ్యేవరకు ఎమర్జెన్సీలో అమలులో ఉండే అవకాశం ఉంది.
టోక్యోలో ఎమర్జెన్సీ- ఒలింపిక్స్ జరిగేనా? - టోక్యోలో కొవిడ్ కేసులు
ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న జపాన్ టోక్యో నగరంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రపంచం నలుమూలల నుంచి క్రీడాకారులను రప్పించి.. మధ్యలో ఒలింపిక్స్ ఆపేయాల్సి వస్తే జపాన్‌కు, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అంతకంటే ఇబ్బందికర పరిస్థితి మరొకటి ఉండదు. దీని వల్ల కలిగే నష్టం కూడా రూ. లక్షల కోట్లలో ఉంటుంది. అందుకే ఒలింపిక్స్ సమయంలో నిబంధనలు కఠినతరం చేయడానికి నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా అత్యయిక స్థితిని విధించిన జపాన్ ప్రభుత్వం, ఒలింపిక్స్ పూర్తయ్యేవరకు దాన్ని కొనసాగించడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:Rohit sharma: హిట్‌మ్యాన్‌పై అనుమానమే లేదు!