మరికొద్ది రోజుల్లో జరగబోయే టోక్యో ఒలింపిక్స్‌లో ప్రీమియమ్ కండోమ్‌ల వాడకంపై నిర్వాహకులు పలు నిబంధనలు విధించారు. కరోనా నేపథ్యంలో అథ్లెట్లు భౌతిక ధూరం పాటించడం సహా ఒలింపిక్ విలేజ్‌లోనూ కండోమ్‌ల వాడకానికి వీలుండదని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది అథ్లెట్లకు కండోమ్‌ల పంపిణీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఒలింపిక్ విలేజ్‌లో కండోమ్‌లను నిషేధిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని తయారీ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒలింపిక్స్‌కు కండోమ్‌లను సంబంధం ఏమిటి? అసలు ఈ మెగా ఈవెంట్లో కండోమ్‌లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు? వాటిని క్రీడాకారులకు పంపిణీ చేయాల్సిన అవసరం ఏముంది? గతంలో జరిగిన ఒలింపిక్స్‌లో ఒక్కో అథ్లెట్లకు ఎన్ని కండోమ్‌లు ఇచ్చారనే విషయాలను ఓ సారి చూద్దాం.
ఎప్పటి నుంచి ఇస్తున్నారు?
1988లో సియోల్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో తొలిసారి అథ్లెట్లకు కండోమ్‌లను పంపిణీ చేశారు నిర్వాహకులు. క్రీడల్లో భాగంగా ఒత్తిడిని జయించడానికి, సురక్షిత శృంగారంతో పాటు హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి అవగాహనలో భాగంగా ఆటగాళ్లకు కండోమ్‌లను ఇవ్వాలని నిర్ణయించారు. దాదాపు రెండు వారాలకు పైగా జరిగే ఈ ఈవెంట్లో విభిన్న దేశాలకు చెందిన అథ్లెట్లు టోర్నీలో పాల్గొంటారు. సమ్మర్ ఒలింపిక్స్‌తో పాటు వింటర్ మెగా ఈవెంట్లలోనూ కండోమ్‌లను పంచడం అప్పటి నుంచి మొదలైంది.
తొలిసారిగా సియోల్ వేదికగా జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో 8,500 కండోమ్‌లను ఆటగాళ్లకు పంపిణీ చేశారు. 1992లో అల్బర్ట్ విల్లే వేదికగా జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో 30 వేల కండోమ్‌లను వాడారు. సాల్ట్ లేక్ సిటీ వేదికగా 2002లో జరిగిన వింటర్ గేమ్స్‌లో తొలిసారి లక్ష కండోమ్‌లను ఉపయోగించారు. 2004 ఎథెన్స్ సమ్మర్ ఒలింపిక్స్‌లో లక్షా 30వేల కండోమ్‌లను వాడారు.
ఇదీ చదవండి:OLYMPICS: ద్యుతి, హిమకు చివరి అవకాశం!