తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇటలీ వేదికగా 2026 వింటర్ ఒలింపిక్స్ - milano

శీతాకాల ఒలింపిక్ పోటీలను మూడోసారి నిర్వహించనుంది ఇటలీ. 2026 వింటర్ ఒలింపిక్స్​ను ఇటలీలోని మిలానో, కొర్టినా డి అంపెజోలో నిర్వహించనున్నారు.

ఇటలీ

By

Published : Jun 25, 2019, 7:16 AM IST

ఇటలీ వేదికగా 2026 వింటర్ ఒలింపిక్స్

2026 వింటర్ ఒలింపిక్స్​ వేదిక ఖరారైంది. ఇటలీలోని మిలానో, కొర్టినా డి అంపెజోలో నిర్వహించనున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది. సోమవారం స్వీడెన్​లో​నిర్వహించిన వేలంలోఈ పోటీల ఆతిథ్యం కోసం ఇటలీ, స్వీడన్ బిడ్ దాఖలు చేయగా.. ఎక్కువ మంది ఐఓసీ సభ్యులు ఇటలీకే ఓటేశారు. ఈ పోటీలు 2026 ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు జరగనున్నాయి.

" ఈ రోజు చారిత్రాత్మక దినం. ఇది ఇటాలియన్ ప్రజలందరి విజయం. ఆరంభం నుంచి ఇప్పటివరకు మమ్మల్ని నమ్మినవారందరికి మా కృతజ్ఞతలు" -మాటియో సాల్వినీ, ఇటలీ మంత్రి

ఇప్పటికే రెండు సార్లు వింటర్ ఒలింపిక్స్ నిర్వహించింది ఇటలీ. 1956 కొర్టినా డి అంపెజో వేదికగా జరుగగా.. 2006 ట్యూరిన్​లో నిర్వహించారు. 2022లో వింటర్ ఒలింపిక్ పోటీలు చైనాలోని బీజింగ్​లో జరగనున్నాయి.

ఇది చదవండి: యువీ రికార్డును బద్దలు కొట్టిన షకిబుల్​

ABOUT THE AUTHOR

...view details