దేశ రాజధానిలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్‌లో ముగ్గురు అథ్లెట్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఆర్‌ఐఏ) ప్రతినిధులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆ ముగ్గురూ తమ హోటల్ గదులకే పరిమితమయ్యారని చెప్పారు. అలాగే వారితో హోటల్ గదులు పంచుకున్న ఇతర అథ్లెట్లకు కరోనా పరీక్షలు చేశారని, వారి రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కాగా, వీరు కూడా ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు వచ్చిన వారిలో ఇప్పటివరకు మొత్తం నలుగురు వైరస్ బారినపడినట్లు అధికారులు స్పష్టం చేశారు.
షూటింగ్ ప్రపంచకప్‌లో కరోనా కలకలం
దిల్లీలో జరుగుతోన్న షూటింగ్ ప్రపంచకప్‌లో కరోనా కలకలం రేపింది. ఈ టోర్నీలో పాల్గొంటున్న ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది.
షూటింగ్ ప్రపంచకప్
కాగా, ఈ ప్రపంచకప్‌లో భారత షూటర్లు దివ్యాంశ్ సింగ్ పన్వర్, అర్జున్ బబుతా సత్తా చాటారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో వీరు ఫైనల్లో చోటు సంపాదించారు. శుక్రవారం జరిగిన 60 షాట్ల క్వాలిఫికేషన్ రౌండ్లో అర్జున్ (631.8 పాయింట్లు) మూడో స్థానం, పన్వర్ (629.1 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచి తుదిపోరుకు అర్హత సాధించారు. మరో భారత షూటర్ దీపక్ కుమార్ (626.4 పాయింట్లు) క్వాలిఫయింగ్ దశ దాటలేకపోయాడు.
Last Updated : Mar 20, 2021, 12:54 PM IST