ISSF World Cup 2022: ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో అంజుం మౌద్గిల్ మెరిసింది. అజర్‌బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల వ్యక్తిగత 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్స్‌లో ఆమె రజతం సొంతం చేసుకుంది. శుక్రవారం స్వర్ణ పతక పోరులో అంజుం 12-16తో రికీ మెంగ్ ఇబ్‌సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడింది. క్వాలిఫయింగ్ స్టేజ్-1లో 587 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి స్టేజ్-2కు అర్హత సాధించిన అంజుం.. స్టేజ్-2లో 406.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. తుది సమరంలోనూ గట్టిగానే పోరాడినా ఆమెకు రజతమే దక్కింది.
ISSF World Cup 2022: మెరిసిన అంజుం.. షూటింగ్ ప్రపంచకప్‌లో రజతం
ISSF World Cup 2022: షూటింగ్ ప్రపంచకప్‌లో రజతంతో సత్తాచాటింది అంజుం మౌద్గిల్. అజర్‌బైజాన్‌లో శుక్రవారం జరిగిన స్వర్ణ పతక పోరులో అంజుం 12-16తో రికీ మెంగ్ ఇబ్‌సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడింది.
పురుషుల టీమ్ త్రిపొజిషన్స్‌లో స్వప్నిల్, దీపక్ కుమార్, గోల్డీ గుర్జార్‌తో కూడిన భారత జట్టు రజతం సాధించింది. పసిడి పోరులో భారత్ 7-17తో క్రొయేషియా చేతిలో ఓడింది. మహిళల త్రిపొజిషన్స్‌లో అంజుం-ఆయూషిలతో కూడిన భారత జట్టు ఫైనల్ చేరడంలో విఫలమైంది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో 1316 పాయింట్లతో రెండో రౌండ్ చేరిన భారత్.. ఆ తర్వాత ముందంజ వేయలేకపోయింది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక స్వర్ణం, మూడు రజతాలతో భారత్ మూడో స్థానంలో ఉంది.
ఇదీ చూడండి:రెజ్లింగ్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు.. ఐదేళ్ల తర్వాత సాక్షికి మళ్లీ