షూటింగ్ ప్రపంచకప్లో మరో బంగారు పతకం భారత్ సొంతమైంది. శుక్రవారం జరిగిన 50 మీటర్ల త్రీ పొజిషన్ మిక్స్డ్ ఈవెంట్లో గెలిచి ఈ ఘనత సాధించింది. సంజీవ్ రాజ్పుత్, తేజస్విని సావంత్ ఇందులో సభ్యులు. ఇదేపోటీలో పాల్గొన్న ఐశ్వరీ ప్రతాప్ సింగ్, సునిధి చౌహాన్.. కాంస్యం సాధించారు.
షూటింగ్ ప్రపంచకప్లో మనకు మరో స్వర్ణం - 50m Rifle 3 Positions Mixed Team event
50 మీటర్ల త్రీ పొజిషన్ మిక్స్డ్ విభాగంలో భారత్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని భారత క్రీడా సమాఖ్య ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
షూటింగ్ ప్రపంచకప్లో మన దేశానికి మరో స్వర్ణం
గురువారం జరిగిన 25 మీటర్ల పిస్టోల్ విభాగంలో మను బాకర్, రహీ సర్నోబత్, చింకీ యాదవ్ బృందం స్వర్ణం చేజిక్కుంచుకుంది. అంతకుముందు 50 మీటర్ల త్రీ పొజిషన్ పోటీలో అంజుమ్, గాయత్రి, శ్రేయ.. వెండి సాధించారు.