తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్: అదరగొట్టిన భారత షూటర్లు

ఐఎస్ఎస్​ఎఫ్​ వరల్డ్​కప్​లో భారత షూటర్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. తాజాగా.. మరో 3 స్వర్ణాలు భారత బృందాన్ని వరించాయి. ఇప్పటివరకు 6 బంగారు పతకాలు సాధించిన ఇండియా.. మొత్తం 14 పతకాలతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 6 మెడల్స్​తో అమెరికా రెండో స్థానంలో ఉంది.

ISSF WC: India's youth brigade dominates, clinches gold in 10m air pistol and rifle mixed team events
ప్రపంచకప్​లో అదరగొడుతున్న భారత షూటర్లు

By

Published : Mar 22, 2021, 8:43 PM IST

దిల్లీ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్​ఎఫ్​ ప్రపంచకప్​లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. సోమవారం జరిగిన పోటీల్లో తాజాగా మరో 3 స్వర్ణాలు చేజిక్కించుకున్నారు. దీంతో.. ఈ ఏడాది టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్​కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటున్నారు షూటర్లు.

10 మీటర్ల ఎయిర్​ పిస్టల్ మిక్స్​డ్​ విభాగంలో యువ షూటర్లు సౌరభ్ చౌదరి, మనూ బాకర్​ జంట గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఇరాన్​ జంట గోల్నౌష్ సెభతోల్లాహి-జావెద్ ఫోరోగిపై భారత్ జోడీ విజయం సాధించింది. తొలుత 0-4తో పోటీలో వెనుకబడిన ఇండియా జోడీ.. గొప్పగా పుంజుకుంది. చివరికి 16-12తో ఇరాన్​ జోడీని చిత్తు చేసి విజయాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచకప్ మిక్స్​డ్ విభాగంలో స్వర్ణం సాధించిన ఐదొవ జంట ఇది.

ఇదీ చదవండి:షూటింగ్ ప్రపంచకప్​లో భారత్​కు మరో స్వర్ణం

ఇక 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్​డ్​ విభాగంలో ఎలావెనిల్-దివ్యాన్ష్ జోడీ​ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఎలావెనిల్​కు ఇదే తొలి సీనియర్ ప్రపంచకప్​ మెడల్​ కాగా, దివ్యాన్ష్​కు నాలుగో పతకం. హంగేరియాకు చెందిన ప్రపంచ నంబర్​ వన్ జంట ఇస్తావాన్ పెని-ఎస్జ్టర్ డెనెస్ జంటను 16-10 తేడాతో ఓడించింది భారత జోడీ. కరోనా అనంతరం ఆడుతున్న తొలి టోర్నమెంట్​ అయినప్పటికీ.. వీరిద్దరూ ఎక్కడా తడబాటుకు గురికాలేదు.

పురుషుల స్కీట్​ విభాగంలో భారత బృందం స్వర్ణం గెలుపొందింది. ఖతార్​కు చెందిన నాసర్ అల్​ అట్టియా, అలీ అహ్మద్​, రషీద్​ హమద్​ బృందంపై ఇండియా టీమ్​ విజయం సాధించింది. గోల్డ్​ మెడల్ సాధించిన వారిలో గుర్జోట్​ ఖన్గురా, మైరాజ్​ అహ్మద్ ఖాన్, అన్గద్​​ వీర్ సింగ్​ బజ్వా ఉన్నారు.

ఇప్పటివరకు ఈ వరల్డ్​కప్​లో 6 బంగారు, 4 రజతాలతో పాటు 4 కాంస్య పతకాలు సాధించిన ఇండియా.. మొత్తం 14 పతకాలతో లిస్టులో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 3 గోల్డ్ మెడల్స్​, 2 సిల్వర్​, ఒక కాంస్య పతకంతో అమెరికా తర్వాతి స్థానంలో ఉంది.

ఇదీ చదవండి:ఎయిర్​ పిస్టల్​ మిక్స్​డ్​ విభాగంలో భారత్​కు స్వర్ణం

ABOUT THE AUTHOR

...view details