ఒలింపిక్స్‌ను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ). ఈ క్రమంలోనే ఈ మెగాక్రీడల్లో పాల్గొనే ఒలింపిక్స్, పారాఒలింపిక్స్ క్రీడాకారులు.. కరోనా టీకా వేయించుకోవాలని కోరింది.
టోక్యో సహా 2022 బీజింగ్ వింటర్ గేమ్స్‌ను భద్రతగా నిర్వహించే విషయమై నేషనల్ ఒలింపిక్ కమిటీలు(ఎన్ఓసీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)తో సంప్రదించారు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్. ఇందులో భాగంగానే క్రీడాకారులు, ఇతర సిబ్బంది రక్షణను దృష్టిలో పెట్టుకుని కరోనా జాగ్రత్త చర్యలు, నిబంధనలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను తయారుచేసినట్లు వెల్లడించారు. ఇమిగ్రేషన్ విధానాలు, క్వారంటైన్, వైరస్ టెస్టులు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, కాంటాక్ట్ ట్రేసింగ్, వ్యాక్సినేషన్ సహా పలు అంశాలు ఇందులో ఉన్నాయి.