టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)లో పాల్గొనేందుకు వచ్చే అథ్లెట్ల కోసం రీసైక్లింగ్‌కు వీలుండే కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసిన బెడ్లను ఉపయోగించనున్నారు. అయితే కరోనా కారణంగా ఒలింపిక్స్‌లో శృంగారం కట్టడికి నిర్వాహకులు ఈ విధంగా చర్యలు చేపట్టారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ రూమర్లపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) స్పందించింది. ఒలింపిక్ గ్రామంలో క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన బెడ్లు మన్నిక కలిగినవని ఐఓసీ భరోసా ఇస్తూ సోమవారం ఓ ప్రకటన చేసింది.
మరోవైపు ఒలింపిక్ గ్రామంలో ఏర్పాటు చేసిన పడకలు మన్నికగా లేవనే వార్తలను ఐర్లాండ్‌కు చెందిన జిమ్నాస్టిక్ ఆటగాడు రైస్ మెక్‌క్లెనాఘన్ కొట్టిపారేశాడు. తనకు కేటాయించిన బెడ్‌పై జంప్ చేస్తున్న వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు.
"ఇవి యాంటీ సెక్స్ పడకలు అన్నది అవాస్తవం. ఇదొక ఫేక్ న్యూస్.. ఫేక్ న్యూస్.."- మెక్‌క్లెనాఘన్, ఐర్లాండ్ జిమ్నాస్టిక్