భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్‌కు ఆరుదైన గౌరవం దక్కింది. 10 మందితో కూడిన ప్రఖ్యాత అథ్లెట్ అంబాసిడర్స్ గ్రూపులో మేరీకోమ్‌ను నియమిస్తూ ప్రపంచ ఒలంపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. ఈ గ్రూపు నుంచి మేరీ కోమ్ ఆసియా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించనుంది.
ప్రతి ప్రాంతానికి ఒక మహిళ, ఒక పురుష బాక్సర్ రాయబారిగా ప్రాతినిధ్యం వహించి.. ఆ ప్రాంతంలోని బాక్సింగ్ సమాజంతో కలిసి పనిచేస్తారు. అలాగే టోక్యో ఒలంపిక్స్ 2020 కోసం బాక్సింగ్ టాస్క్ ఫోర్స్ (బీటీఎఫ్) నిర్వహించే.. అర్హత పోటీల రూపకల్పనలో ఈ గ్రూపు సహాయ పడనున్నట్లు ఐఓసీ తెలిపింది.