త్వరలో జరగబోయే టోక్యో, బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు కరోనా టీకా వేసేందుకు.. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ), చైనాలు ఓ అవగాహనకు వచ్చాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఐఓసీ ప్రకటించింది.
చైనా ప్రతిపాదనను స్వాగతించిన ఐఓసీ.. నిజమైన క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని ఐఓసీ అధ్యక్షుడు థామస్‌బాచ్ పేర్కొన్నారు. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు రెండు కంటే ఎక్కువ డోసులు అవసరమైతే అందుకయ్యే వ్యయాన్ని ఐఓసీ భరిస్తుందన్నారు.