తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత అథ్లెట్స్​కు కరోనా టీకా​ అందించాలి' - indian athlets corona vaccine

కరోనా వ్యాక్సిన్​ను అందించే విషయంలో భారత అథ్లెట్స్​కు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​కు లేఖ రాసింది భారత ఒలింపిక్స్​ సంఘం. ఈ ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్​ జరగనున్నాయి.

olympic
ఒలింపిక్​

By

Published : Feb 10, 2021, 5:36 AM IST

టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనే భారత అథ్లెట్స్​కు కరోనా వ్యాక్సిన్​ అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది భారత ఒలింపిక్​ అసోసియేషన్​. వారు ఈ మెగా క్రీడల్లో పాల్గొనడానికి బయలుదేరే నాటికి టీకాను అందించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​కు లేఖ రాసింది. టీకాను అందించే విషయంలో అథ్లెట్స్​కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్​ జరగనున్నాయి. ఇప్పటికే ఈ మెగా క్రీడలకు 74 మంది భారత అథ్లెట్లు అర్హత సాధించారు. మరో 75 మంది వరకు అర్హత సాధించే అవకాశం ఉంది.

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని ఇటీవల కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. వారు క్రీడలకు బయలుదేరడానికి ముందే ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పారు. అయితే దీనిపై తుది నిర్ణయం ఆరోగ్య మంత్రిత్వ శాఖదే అని వెల్లడించారు. కాగా, ఇటీవలే ఒలింపిక్స్​లో పాల్గొనే క్రీడాకారులు కరోనా వ్యాక్సిన్​ను వేయించుకోవాల్సిందిగా కోరారు ఐఓసీ అధ్యక్షుడు థామస్​ బాచ్​. అయితే ఇదేం తప్పనిసరేం కాదని అన్నారు.

ఇదీ చూడండి: ఒలింపిక్స్​ నిర్వహణ కోసం 'ఐఓసీ' రూల్ బుక్

ABOUT THE AUTHOR

...view details