తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఐఓఏ అధ్యక్షుడు ఉల్లంఘనలకు పాల్పడ్డారు' - నరీందర్​ బాత్రా ఐఓసీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు

భారత ఒలింపిక్​ సంఘం అధ్యక్షుడు నరీందర్​ బత్రా చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడి, ప్రెసిడెంట్ అయ్యారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఐహెచ్​ఎఫ్​తో పాటు ఐఓఏకు ఫిర్యాదు చేశారు సుధాన్షు మిట్టల్.

batra
బాత్రా

By

Published : Jun 11, 2020, 10:58 AM IST

భారత ఒలింపిక్​ సంఘం అధ్యక్షుడు నరీందర్​ బత్రాపై, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సుధాన్షు మిట్టల్.. అంతర్జాతీయ హాకీ సమాఖ్య సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఆయన తాను ఎన్నిక కావడంలో చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు.

2014 భారత హాకీ అధ్యక్షుడు ఎన్నికలు, 2017 భారత ఒలింపిక్​ సంఘం ఎన్నికల సమయంలో బాత్రా, నిబంధనల అతిక్రమణకు పాల్పడినట్లు సుధాన్షు లేఖలో రాసుకొచ్చారు. ఆయనకు ఎన్నికల్లో నిల్చునే అర్హత లేదని, తప్పుడు ఆధారాలు చూపించి పోటీ చేశారని చెప్పారు. వీలైనంత త్వరగా దీనిపై అత్యున్నత స్థాయి అధికారులతో సమగ్ర పరీశీలన చేపట్టాలని కోరారు. నరీందర్ బత్రాపై నిషేధం విధించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీకి కూడా మెయిల్​ ద్వారా బత్రాపై ఫిర్యాదు చేశారు సుధాన్షు.

ఈ ఆరోపణలపై స్పందించిన నరీందర్​ బత్రా... వచ్చే ఏడాది ఐఓఏ ఎన్నికలు ఉన్నందునే ఇలా మాట్లాడుతున్నారని, తన పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం తన ఇంట్లో ఏడుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్​గా​ తేలడం వల్ల క్వారంటైన్​లో ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఇది చూడండి : భారత ఒలింపిక్ కమిటీ ఛైర్మన్​ ఇంట్లో ఐదుగురికి కరోనా

ABOUT THE AUTHOR

...view details