తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఐఓఏ' అధికారిక మెడిటేషన్ భాగస్వామిగా 'ధ్యాన' - భారత ఒలింపిక్ సంఘం

భారత బ్యాడ్మింటన్​ కోచ్​ పుల్లెల గోపీచంద్​ మార్గనిర్దేశనంలోని 'ధ్యాన' (Dhyana)తో భారత ఒలింపిక్​ సంఘం(IOA) చేతులు కలిపింది. టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనే భారత క్రీడాకారులకు మానసిక ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. టోక్యో మెగా ఈవెంట్​లో 'ధ్యాన' అధికారిక మెడిటేషన్​ భాగస్వామిగా వ్యవహరించనుంది.

IOA, Dhyana
ఐఓఏ, ధ్యాన

By

Published : Jul 13, 2021, 8:19 AM IST

టోక్యో ఒలింపిక్స్‌ (Tokyo Olympics)కు వెళ్లే క్రీడాకారుల మానసిక ఆరోగ్యం కోసం పుల్లెల గోపీచంద్‌(Pullela Gopichand) మార్గనిర్దేశనంలోని 'ధ్యాన' (Dhyana)తో భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) (IOA) చేతులు కలిపింది. ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులకు ధ్యాన అధికారిక మెడిటేషన్‌ భాగస్వామిగా వ్యవహరించనుంది.

ఒలింపిక్స్‌ వంటి మెగా టోర్నీలో క్రీడాకారులు, కోచ్‌లు, సహాయ సిబ్బంది ఒత్తిడిని అధిగమించేందుకు ఈ ధ్యాన పరికరం సహాయపడనుంది. ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరి కోసం ధ్యాన ఉంగరాలు, కిట్‌లను ఐఓఏ తీసుకుంది. ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో క్రీడాకారుల మానసిక ఆరోగ్యం.. ఏకాగ్రత మెరుగుపరచడం కోసమే ధ్యానతో చేతులు కలిపినట్లు ఐఓఏ ప్రకటించింది.

"అసాధారణ పరిస్థితుల్లో జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో కఠినమైన సవాళ్లు ఎదురవ్వొచ్చు. ఆటగాడిగా, కోచ్‌గా ధ్యానంతో ఎన్నో ప్రయోజనాలు పొందాను. మెడిటేషన్‌ తీవ్రతను పక్కాగా తెలియజేయడం ద్వారా టోక్యోలో భారత బృందానికి ధ్యాన ఎంతగానో ఉపయోపడుతుంది" అని గోపీచంద్‌ తెలిపాడు.

ఇదీ చదవండి:Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్​ నుంచి తప్పుకున్న గోపీచంద్

ABOUT THE AUTHOR

...view details