తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo Olympics: విదేశాల్లో అథ్లెట్ల పరిస్థితేంటి?

భారత్‌తో పాటు మరో పదకొండు దేశాల అథ్లెట్లు జపాన్‌లోకి అడుగుపెట్టే వారం రోజుల ముందు ప్రతిరోజూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. టోక్యో చేరుకున్నాక మూడురోజులు ఎవరినీ కలవకూడదని నిబంధనలు పెట్టారు ఒలింపిక్(Tokyo Olympics) నిర్వాహకులు. ఈ నేపథ్యంలో విదేశాల్లో శిక్షణ పొందుతున్న భారత అథ్లెట్లకు టోక్యో నిర్వాహకులు విధించిన ఆంక్షలు వర్తిస్తాయో లేదో స్పష్టత ఇవ్వాలని కోరాడు ఐవోఏ అధ్యక్షుడు బత్రా.

narinder bathra
నరీందర్ బత్రా

By

Published : Jun 22, 2021, 6:42 AM IST

విదేశాల్లో శిక్షణ పొందుతున్న భారత అథ్లెట్లకు టోక్యో నిర్వాహకులు విధించిన ఆంక్షలు వర్తిస్తాయో లేదో స్పష్టత ఇవ్వాలని భారత ఒలింపిక్‌ సంఘం(IOA) కోరింది. భారత్‌తో పాటు మరో పదకొండు దేశాల అథ్లెట్లు జపాన్‌లోకి అడుగుపెట్టే వారం రోజుల ముందు ప్రతిరోజూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. టోక్యో చేరుకున్నాక మూడురోజులు ఎవరినీ కలవకూడదని నిబంధనలు పెట్టిన నేపథ్యంలో ఐవోఏ ఈ వివరణ అడిగింది.

"నీరజ్‌ చోప్రా, వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా లాంటి స్టార్‌ అథ్లెట్లు ఇప్పటికే విదేశాల్లో శిక్షణ కొనసాగిస్తున్నారు. వీరు అటు నుంచి అటే టోక్యోకు వెళ్లనున్నారు.‘‘నెల రోజులపైగానే చాలామంది భారత అథ్లెట్లు విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఆయా దేశాల నుంచి వారు నేరుగా టోక్యో వెళ్లాల్సి ఉంది. టోక్యో నిర్వాహకులు నిబంధనలు పెట్టిన 11 దేశాల జాబితాలో భారత అథ్లెట్లు శిక్షణ పొందుతున్న దేశాలు లేవు. మరి మా అథ్లెట్లు నేరుగా జపాన్‌కు రావచ్చా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలి" అని ఐవోఏ అధ్యక్షుడు బత్రా టోక్యో నిర్వాహకులకు రాసిన లేఖలో ప్రశ్నించాడు.

ఇవీ చూడండి: ద్యుతీ జాతీయ రికార్డు.. ఐనా దక్కని టోక్యో బెర్త్​

ABOUT THE AUTHOR

...view details