గాల్వన్ ఘటనలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు వీరమరణం చెందారు. ఈ నేపథ్యంలో చైనీస్ యాప్‌లను నిషేధించాలని కోరడం సహా ఆ దేశంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో భారత ఒలింపిక్ అసోసియేషన్.. చైనా ఉత్పత్తులను, స్పాన్సర్లను బాయ్‌కాట్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా మాట్లాడుతూ.. 'లై-నింగ్' సంస్థతో తెగతెంపులు చేసుకోనున్నట్లు చెప్పుకొచ్చారు. తమకు దేశమే తొలి ప్రాధాన్యత అని అన్నారు.
చైనా స్పాన్సర్లతో కటీఫ్.. ఐఓఏ కీలక నిర్ణయం
చైనాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత ఒలింపిక్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనా స్పాన్సర్లు, ఉత్పత్తులను నిషేధించనున్నట్లు పేర్కొంది.
భారత ఒలింపిక్ అసోసియేషన్
2018 మేలో 'లై-నింగ్'తో భారత ఒలింపిక్ అసోసియేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టోక్యో ఒలింపిక్స్ వరకు భారత్ అథ్లెట్లకు రూ.5-6 కోట్ల విలువైన క్రీడా పరికరాలను సదరు సంస్థ అందివ్వనుంది.
ఇవీ చదవండి: