ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా 2022లో కామన్వెల్త్ క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ నుంచి షూటింగ్‌ను తప్పించే ఆలోచనలో ఉన్నారు నిర్వాహకులు. ఇదే జరిగితే ఈ మెగా ఈవెంట్‌ను బహిష్కరిస్తామని హెచ్చరిక జారీ చేసింది భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ). దీనిపై చర్చించేందుకు వీలైనంత త్వరగా సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజుకు శనివారం లేఖ రాశారు ఐఓఏ అధ్యక్షుడు నరిందర్ బత్రా.
" 2022లో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనకుండా నిరసన తెలియజేయాలనుకుంటున్నాం. ఇలాంటి అసంబద్ధ ఆలోచనలను కచ్చితంగా వ్యతిరేకించాలి. భారత్ ఇంకా బ్రిటీష్ పాలనలో లేదని వారు తెలుసుకోవాలి. ప్రతిసారి భారత్ పట్టు సంపాదించిన క్రీడల్లో నిబంధనలు మారుస్తున్నారు లేదంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈసారి వాటిని ప్రతిఘటించాలని నిర్ణయించుకున్నాం ".
-- నరిందర్ బత్రా, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు