అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో(ఐఓసీ) సభ్యుడిగా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరిందర్ బత్రా ఎన్నికయ్యాడు. మొత్తం 62 ఓట్లలో బత్రాకు 58 ఓట్లు పోలయ్యాయి. స్విట్జర్లాండ్ లాసన్నేలోబుధవారంజరిగిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.
ఐఓసీ సభ్యుడిగా నరిందర్ బత్రా - narinder batra
ఐఓసీ సభ్యుడిగా భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరిందర్ బత్రా ఎన్నికయ్యారు. మొత్తం 62 ఓట్లలో 58 ఓట్లు బత్రాకు పోలయ్యాయి.
ఐఓసీ
ఐఓఏ అధ్యక్షుడిగా ఉంటూ ఐఓసీ సభ్యుడిగా ఎన్నికైన మొదటి భారతీయుడిగా ఘనత సాధించాడు. బత్రా ఎన్నికతో ఐఓసీలో భారతీయుల సంఖ్య రెండుకు చేరుకుంది. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతూ అంబానీ 2016 నుంచి ఐఓసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
ఇంతకు ముందు మాజీ ఐఓఏ సెక్రటరీ జనరల్ రణ్‌ధీర్ సింగ్ 2001 నుంచి 2014 వరకు ఐఓసీ సభ్యుడిగా సేవలందించాడు.