చైనాకు సంబంధించిన 59 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించిన కేంద్రం నిర్ణయంపై, భారత మహిళా షూటర్ హీనా సిద్ధూ హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యంగా టిక్‌టాక్‌ను బ్యాన్ చేయడంపై తెగ ఆనందపడిపోయింది. దీని వల్ల అంతర్జాలంలో అవాంఛనీయ వీడియోలకు చెక్ పెట్టినట్లయిందని ట్విట్టర్లో రాసుకొచ్చింది.
"టిక్‌టాక్‌ను తొలగించడం వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఈ యాప్‌లో జంతువులను హింసించే వీడియోలతో పాటు అసభ్యకరమైనవి విపరీతంగా వచ్చేవి. అలాంటి వాటిని నియంత్రించే బాధ్యత టిక్‌టాక్ యాజమాన్యంపై ఉంది. ఆ సంస్థ అప్లోడ్ కంటెంట్ సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయకపోతే, మన జీవితంలో దానికి (యాప్) చోటు ఉండకూడదు. టిక్‌టాక్ లేకుండా ఇంటర్నెట్ ప్రశాంతంగా ఉంది"