అంతర్జాతీయ షూటర్, కోచ్ మోనాలి గోర్హే కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె తండ్రి కూడా ఇదే కారణంతో మరణించారు. ఆమె మృతిపై పలువురు క్రీడాకారులు నివాళులు అర్పిస్తున్నారు.
కొవిడ్‌తో ప్రముఖ మహిళా షూటర్, కోచ్ మృతి - మోనాలి గోర్హే లేటేస్ట్ న్యూస్
భారత షూటర్, కోచ్ మోనాలి గోర్హే.. కొవిడ్ బారిన పడి మృతి చెందారు. ఈమె మృతిపై పలువురు సంతాపం తెలుపుతున్నారు.
కోచ్ మోనాలి
మోనాలి శిక్షణలోనే మన దేశ షూటర్లు.. కామన్వెల్త్ షూటింగ్ ఛాంపియన్షిప్స్, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. బంగారు పతకాల్ని కూడా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈమెను కోల్పోవడం షూటర్లకు తీరని లోటు అనే చెప్పాలి.