ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఒలింపిక్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులతో పాటు చాలామంది ప్లేయర్లు కూడా ఎదురుచూస్తుంటారు. గతేడాది జులై 23న జరగాల్సిన ఈ మెగాక్రీడలు.. కరోనా కారణంగా ఏడాది వాయిదాపడ్డాయి. అయితే ఆ పోటీలకు సరిగ్గా నెలరోజుల ముందు అంటే బుధవారం(జూన్ 23) ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే(International Olympic Day) జరుపుకోనున్నారు. అసలు ఒలింపిక్ డే ఎప్పుడు మొదలైంది?
ఒలింపిక్ డే చరిత్ర
1894 జూన్ 23న పారిస్ సోర్బెన్లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని(International Olympic Committee) స్థాపించారు. అందుకు గుర్తుగా ప్రతి ఏడాది ఈ రోజున జాతీయ ఒలింపిక్ కమిటీలు.. ఒలింపిక్ డేను నిర్వహిస్తాయి.
ఐఓసీ చెక్స్లోవేకియా సభ్యుడు డాక్టర్. జోసెఫ్ గ్రస్.. వరల్డ్ ఒలింపిక్ డే గురించి 1947లో స్టాక్హోమ్లో జరిగిన భేటీలో ఒలింపిక్ డే గురించి రిపోర్ట్ సమర్పించారు. ఆ తర్వాత ఏడాది జరిగిన 42వ ఐఓసీ సమావేశంలో.. జూన్ 23ను 'ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే'గా జరుపుకోవాలని సభ్య దేశాలు తీర్మానించాయి.