మాస్టర్ కేశవ్ షాటోకన్ కరాటే అకాడమి ఆధ్వర్యంలో తెలంగాణలో అంతర్జాతీయ కరాటే చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్నారు. తొలిసారిగా ఆన్‌లైన్ ద్వారా జరుపుతున్న ఈ పోటీల్లో 21 దేశాలకు చెందిన దాదాపు 2 వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.
టోర్నమెంట్ బ్రోచర్‌తోపాటు మోడల్ ట్రోఫీని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రంలో మొదటిసారి ఆన్‌లైన్ ద్వారా పోటీలు నిర్వహించడం,2 వేలకు పైగా క్రీడాకారులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.