టోక్యో ఒలింపిక్స్‌లో బెర్తు కోసం శ్రమిస్తున్న భారత అథ్లెట్ హిమదాస్‌కు నిరాశపరిచే వార్త! జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హీట్ విభాగంలో పోటీ పడుతుండగా ఆమె కాలికి గాయమైంది. గాయం తీవ్రత తెలియాల్సి ఉంది.
Olympics: హిమదాస్‌కు గాయం.. ఒలింపిక్స్‌కు కష్టమేనా? - జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ హిమదాస్
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్ హిమదాస్ పాల్గొనేది అనుమానంగా కనపిస్తోంది. జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న సమయంలో ఆమెకు గాయం కావడమే కారణం.
శనివారం జరిగిన జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ టోర్నీలో 100 మీ హీట్ మూడో రౌండ్లో 12.01 సెకండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది హిమ. తద్వారా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ పోటీల్లోనే గాయంతో ఇబ్బందిపడింది. తద్వారా శనివారం సాయంత్రం జరగనున్న తుదిపోరులో ఉంటుందా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.
ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే భారత 4x100 మీ మహిళ రిలే టీమ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అవుతుంది. ఈ విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బృందంలో ద్యుతిచంద్, ధనలక్ష్మి, అర్చన సుసీంద్రన్తో పాటు హిమ కీలక సభ్యురాలు.