తెలంగాణ

telangana

ETV Bharat / sports

Indonesia open 2023 : చరిత్ర సృష్టించిన సాత్విక్‌–చిరాగ్‌.. తొలి భారత జోడీగా రికార్డ్ - HS prannoy indonesia open

Indonesia open 2023 Badminton satwiksairaj rankireddy and chirag shetty : సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ చరిత్ర సృష్టించింది. ఇండోనేసియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్​లో విజేతగా నిలిచింది. ఫలితంగా బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్ టూర్​ సూపర్ 1000 టైటిల్​లో గెలిచిన తొలి భారత్​ జోడీగా రికార్డుకెక్కింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 18, 2023, 3:36 PM IST

Updated : Jun 18, 2023, 3:53 PM IST

Indonesia open 2023 Badminton : భారత పురుషుల డబుల్స్‌ బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ద్వయం ఇప్పుడు మరో సంచలనం సృష్టించింది. ఇండోనేసియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో.. పురుషుల డబుల్స్‌ ఫైనల్​లో విజేతగా నిలిచింది. ఈ తుది పోరులో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ భారత ద్వయం మలేషియాకు చెందిన అరోన్​ చియా-సో వూయ్​ ఇక్ జోడీని 21-17, 21-18 తేడాతో ఓడించింది. ఫలితంగా బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్ టూర్​ సూపర్ 1000 టైటిల్​లో గెలిచిన తొలి భారత్​ జోడీగా రికార్డుకెక్కింది.

satwik sairaj rankireddy and chirag shetty : అంతకుముందు ఈ ద్వయం సెమీస్​లో 17-21, 21-19, 21-18 తేడాతో సౌత్​ కొరియాకు చెందిన కాంగ్‌ మిన్‌ హిక్‌–సియో సెంగ్‌ జె జోడీని ఓడించి టైటిల్ పోరుకు అర్హ‌త సాధించింది. ఫలితంగా బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్ టూర్​ సూపర్ 1000 ఈవెంట్​లో ఫైనల్​కు చేరిన మొద‌టి భార‌త జోడీగా రికార్డు సృష్టించింది. క్వార్టర్స్​లో 21-13, 21-13 తేడాతో టాప్‌ సీడ్‌ ఫజర్‌ అల్ఫియాన్‌- మహమ్మద్‌ రియాన్‌ (ఇండోనేసియా)పై విజయాన్ని అందుకుంది. మంచి స్మాష్‌లు, డ్రాప్‌లు, క్రాస్‌కోర్టు షాట్లతో విజృంభించిన ఈ ద్వయం 41 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఇక ఈ సీజన్‌లో ఈ జోడీ.. స్విస్‌ ఓపెన్, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో గెలుపొంది గోల్డ్​ మెడల్స్​ను ముద్దాడగా.. మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్‌ చేరింది.

HS prannoy indonesia open : ప్రణయ్​ ఓటమి..పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో మూడో సీడ్‌ కొడాయ్‌ నరోకా (జపాన్‌)ను 21-18, 21-16 తేడాతో ఓడించి సెమీస్​కు అర్హత సాధించిన హెచ్ ఎస్ ప్రణయ్​.. సెమీస్​లో నిరాశ ఎదురైంది. డెన్మార్క్​కు చెందిన విక్టర్​ యాక్సల్​సెన్​పై పరాజయాన్ని అందుకున్నాడు. 15-21 15-21 తేడాతో ఇంటి ముఖం పట్టాడు.

Sindhu indonesia open : శ్రీకాంత్​, సింధు కూడా​.. భార‌త స్టార్ షట్లర్స్​​ కిదాంబి శ్రీ‌కాంత్‌, పీవీ సింధు కూడా టోర్నీ మొదట్లోనే వెనుదిరిగారు. మ‌హిళ‌ల సింగిల్స్‌లో ఫేవరెట్​గా బరిలోకి దిగిన పీవీ సింధు రెండో రౌండ్​లోనే వెనుదిరగగా... శ్రీకాంత్ క్వార్ట‌ర్స్‌లో​ నిష్క్రమించాడు.

ఇదీ చూడండి :

PV Sindhu Indonesia Open : ఇండోనేసియా ఓపెన్​లో సింధు, ప్రణయ్​ శుభారంభం.. తొలి రౌండ్​లో విజయం ​

సాత్విక్​- చిరాగ్ అదరహో.. 52 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆసియా బ్యాడ్మింటన్‌లో గోల్డ్​ మెడల్​

Last Updated : Jun 18, 2023, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details