తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇండోనేసియా మాస్టర్స్​ క్వార్టర్స్‌లో సింధు, లక్ష్యసేన్‌

PV Sindhu: ఇండోనేసియా బ్యాడ్మింటన్‌ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది పి.వి.సింధు. ప్రిక్వార్టర్స్‌లో 23-21, 20-22, 21-11తో అన్‌సీడెడ్‌ జార్జియా టున్‌జుంగ్‌ (ఇండోనేసియా)పై కష్టపడి గెలిచింది.

indonesia-masters-2022
ఇండోనేసియా టోర్నీ క్వార్టర్స్‌లో సింధు

By

Published : Jun 10, 2022, 5:01 AM IST

Indonesia masters 2022: భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ఇండోనేసియా బ్యాడ్మింటన్‌ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. గురువారం మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌ సింధు 23-21, 20-22, 21-11తో అన్‌సీడెడ్‌ జార్జియా టున్‌జుంగ్‌ (ఇండోనేసియా)పై కష్టపడి గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలి రెండు గేమ్‌లలో ప్రత్యర్థి నుంచి సింధుకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. తొలి గేమ్‌ ఆరంభంలో దూకుడుగానే ఆడిన భారత స్టార్‌ 10-5తో సులభంగా గేమ్‌ గెలిచేలా కనిపించింది. కానీ పుంజుకున్న జార్జియా.. సింధుకు గట్టిపోటీ ఇచ్చింది. ఆ తర్వాత గేమ్‌లోనూ సింధు ప్రతి పాయింట్‌కూ చెమటోడ్చక తప్పలేదు. ఒక దశలో ఆమె 5-10తో వెనకబడింది. కానీ పుంజుకున్న సింధు 15-15తో స్కోరు సమం చేసింది. ఆఖర్లో తడబడిన సింధు గేమ్‌ చేజార్చుకుంది. కానీ మూడో గేమ్‌లో సింధు.. జార్జియాకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 7-0తో ఆధిక్యంలోకి వెళ్లడమే కాక ఆ తర్వాత అదే జోరుతోడి తేలిగ్గా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

మరోవైపు భారత యువ సంచలనం లక్ష్యసేన్‌ కూడా క్వార్టర్స్‌ చేరాడు. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో లక్ష్య 21-18, 21-15తో రాస్మస్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమీత్‌రెడ్డి-అశ్విని పొన్నప్ప పోరాటం ముగిసింది. సుమీత్‌ జోడీ 18-21, 13-21తో జెంగ్‌ వుయ్‌-హంగ్‌ యా (చైనా) జంట చేతిలో ఓడింది.

ABOUT THE AUTHOR

...view details