దిల్లీ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు పతకాల వేటలో విజృంభిస్తున్నారు. తాజాగా మరో స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో విజయ్‌వీర్ సిధు-తేజస్విని జంట బంగారు పతకం గెలిచింది.
ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం - విజయ్‌వీర్ సిధు
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో విజయ్‌వీర్ సిధు-తేజస్విని జంట బంగారు పతకం సాధించింది.
ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్ మిక్స్డ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం
స్వదేశానికి చెందిన గురుప్రీత్ సింగ్-అశోక్ అభినయ పాటిల్ జోడీపై 9-1తో విజయం సాధించింది. తాజా స్వర్ణంతో మొత్తం బంగారు పతకాల సంఖ్య 13కి చేరింది. 8 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తం 27 పతకాలను కైవసం చేసుకుంది ఇండియా.
ఇదీ చదవండి:భారత్-ఇంగ్లాండ్ వన్డేలో నమోదైన రికార్డులు!