తెలంగాణ

telangana

ETV Bharat / sports

చదరంగం:  ప్రపంచ 3వ ర్యాంకులో కోనేరు హంపి

చెస్ ఫెడరేషన్ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్​లో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి. రెండేళ్ల విరామం తర్వాత పునరాగమనం చేసిన ఈ తెలుగుతేజం... 2,577 పాయింట్లు ఖాతాలో వేసుకుంది.

హంపి

By

Published : Oct 3, 2019, 8:01 PM IST

భారత చదరగంగం క్రీడాకారిణి కోనేరు హంపి తాజా ర్యాంకింగ్స్​లో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్(ఫిడె​) ప్రకటించిన వరల్డ్ ర్యాంకింగ్స్​లో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

రెండేళ్ల విరామం తర్వాత పునరాగమనం చేసిన ఈ తెలుగు తేజం... ఇటీవల రష్యాలో జరిగిన ఫిడె ​గ్రాండ్​ప్రి టైటిల్ నెగ్గింది. ఈ టోర్నీలో చక్కటి ప్రదర్శన చేసి 2,577 పాయింట్లు ఖాతాలో వేసుకుంది.

2017లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన కోనేరు హంపి రెండేళ్లు ఆటకు దూరంగా ఉంది. ఇప్పటివరకు ఈ క్రీడాకారిణి... ఫిడె ప్రపంచ గ్రాండ్​ప్రి టోర్నీల్లో ఏడు టైటిళ్లు గెలిచింది.

చైనా క్రీడాకారిణి హోయు యిఫాన్ 2,659 పాంయిట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ దేశానికే చెంది జు వెన్జున్ 2,586 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఓపెన్ విభాగంలో భారత చెస్ స్టార్ విశ్వనాథ్ ఆనంద్ 2,765 పాయింట్లతో 9వ స్థానంలో ఉండగా.. నార్వే చెస్ ఛాంపియన్​ మాగ్నస్ కార్లసన్​ 2,876 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇదీ చదవండి: విశాఖలో మయాంక్​ అగర్వాల్​ 'డబుల్​' ధమాకా

ABOUT THE AUTHOR

...view details