మలేసియా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ సూపర్ 1000 టోర్నీలో భారత షట్లర్లకు నిరాశ ఎదురైంది. స్టార్ ఆటగాళ్లు కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. జపాన్ ఆటగాడు కెంటా నిషిమొటో చేతిలో కిదాంబి శ్రీకాంత్ పరాజయం పాలయ్యాడు. 19-21, 14-21 తేడాతో ఓటమి చవిచూశాడు. కాగా, మహిళల సింగిల్స్‌లో చైనాకు చెందిన హాన్ యుతో సైనా నెహ్వాల్ ఓడిపోయింది. 12-21, 21-17, 12-21 తేడాతో సైనా ఓటమిపాలైంది.
మలేసియా ఓపెన్‌లో సైనా, శ్రీకాంత్‌కు షాక్.. తొలి రౌండ్‌లోనే ఇంటికి - కిదాంబి శ్రీకాంత్ లేటెస్ట్ అప్డేట్స్
మలేసియా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ సూపర్ 1000 టోర్నీ తొలి రౌండ్‌లోనే సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ పరాజయం పాలయ్యారు. జపాన్ ఆటగాడు కెంటా నిషిమొటో చేతిలో శ్రీకాంత్ ఓడిపోగా.. చైనా క్రీడాకారిణి చేతిలో సైనా నెహ్వాల్ పరాజయం చవిచూసింది.
srikanth kidambi
మరోవైపు గాయంతో అయిదు నెలలు ఆటకు దూరంగా ఉన్న భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు మళ్లీ రాకెట్ పట్టనుంది. మలేసియన్ ఓపెన్ టోర్నీలోనే సింధు పునరాగమనం చేయనుంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఒలింపిక్ మాజీ ఛాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)ను ఢీకొననుంది. సింధుపై 9-5తో మెరుగైన గెలుపొటముల రికార్డున్న మారిన్.. భారత క్రీడాకారిణితో తలపడిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ పైచేయి సాధించింది.