మహిళల స్పీడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రన్నరప్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో హారిక 13-15 పాయింట్ల తేడాతో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ హో ఇఫాన్(చైనా) చేతిలో ఓడింది. ఒక దశలో హారిక-ఇఫాన్ 13-13 పాయింట్లతో సమానంగా నిలిచారు. తర్వాత హారిక 13-10తో విజేతగా నిలిచేలా కనిపించింది. కానీ వరుసగా మూడు గేమ్‌లు గెలిచిన ఇఫాన్ స్కోరు సమం చేసింది. చివరి రెండు రౌండ్లలో ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఈ చైనా వెటరన్ టైటిల్ సొంతం చేసుకుంది.
స్పీడ్ చెస్ ఛాంపియన్షిప్ రన్నరప్‌గా హారిక - ద్రోణవల్లి హారిక
భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మహిళల స్పీడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో 13-15 పాయింట్ల తేడాతో చైనా అమ్మాయి హో ఇఫాన్ గెలుపొందింది.
ద్రోణవల్లి హారిక, మహిళల స్పీడ్ చెస్ ఛాంపియన్షిప్
"ఫైనల్ పోరు జరుగుతుండగా ఇంటర్నెట్ అంతరాయం కలిగించడం వల్ల ఇబ్బందిపడ్డాను. అయితే పరాజయానికి ఇదే కారణాన్ని చెప్పదల్చుకోలేదు. ఇఫాన్ గొప్పగా ఆడింది. నేను చివరి వరకు పోరాడాను" అని హారిక తెలిపింది.
ఇదీ చదవండి:చదరంగంలో 'అతిపిన్న' అభిమన్యుడు