తెలంగాణ

telangana

ETV Bharat / sports

డోపింగ్​ కోరల్లో భారత 'ఎన్​బీఏ' ఆటగాడు

నేషనల్​ బాస్కెట్​బాల్​ అసోసియేషన్​(ఎన్​బీఏ)లో చోటుదక్కించుకున్న భారత ఆటగాడు సత్నామ్​ సింగ్​... డోపింగ్​లో పట్టుబడ్డాడు. ఇటీవల జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) ఈ ఆటగాడి శాంపిల్స్‌ను పరీక్షించింది. ఇందులో 23 ఏళ్ల పంజాబీ ప్లేయర్‌ నిషిద్ధ ఉత్ప్రేరకం వాడినట్లు తేలింది.

indias first nba player satnam singh suspended after failing in dope test
డోపింగ్​ కోరల్లో భారత 'ఎన్​బీఏ' ఆటగాడు

By

Published : Dec 8, 2019, 11:13 AM IST

ఎన్‌బీఏ డ్రాఫ్టింగ్‌లో చోటు సంపాదించిన తొలి భారత ఆటగాడిగా... ఘనత సాధించిన సత్నామ్‌సింగ్‌ డోపింగ్‌లో పట్టుబడ్డాడు. గత నెలలో బెంగళూరులో జరిగిన దక్షిణాసియా క్రీడల సన్నాహక శిబిరం సందర్భంగా... జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) జరిపిన పరీక్షల్లో సత్నామ్‌ 'ఎ' శాంపిల్‌ పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా అతనిపై ప్రాథమికంగా సస్పెన్షన్‌ వేటు పడింది.

ఒకవేళ సత్నామ్‌ 'బి' శాంపిల్‌ కూడా పాజిటివ్‌గా తేలితే.. జాతీయ డోపింగ్‌ నిరోధక సంఘం క్రమశిక్షణ కమిటీ అతణ్ని విచారించి శిక్ష విధిస్తుంది. డోపీగా తేలితే గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం ఎదుర్కోనున్నాడీ పంజాబీ ప్లేయర్​. వ్యక్తిగత కారణాలు చూపి ఈ ఆటగాడు దక్షిణాసియా క్రీడల నుంచి వైదొలిగాడు.

ABOUT THE AUTHOR

...view details