దిల్లీలో జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రికార్డు సృష్టించింది దివ్య కక్రాన్. ప్రపంచ స్థాయి వేదికపై పసిడి గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా పేరు తెచ్చుకుంది. గురువారం జరిగిన 68 కేజీల విభాగంలో... ప్రత్యర్థి రెజ్లర్ నరుష మత్సుయుకి(జపాన్)పై అలవోకగా విజయం సాధించింది.
గతంలో ఈ మెగాటోర్నీలో తొలిసారి పసిడి గెలిచి చరిత్ర సృష్టించింది నవజోత్ కౌర్. 2018లో కిర్గిస్థాన్ వేదికగా జరిగిన పోటీల్లో 65 కేజీల విభాగంలో దేశానికి స్వర్ణం అందించింది.